కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం | fire accident at chemical factory in ongole | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

May 20 2017 7:54 AM | Updated on Sep 13 2018 5:11 PM

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఒంగోలులోని వ్యవసాయ రసాయనాల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఒంగోలు: ఒంగోలులోని వ్యవసాయ రసాయనాల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కెమికల్స్‌ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఓ మూలన చిన్నగా ప్రారంభమైన మంటలు నిమిషాల్లో మూడంతస్తులకు వ్యాపించాయి. మంటలు తీవ్రతరం కావడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తోంది.

అయితే అప్పటికే ఆసల్యమైపోయింది. రసాయనాల ఉత్పత్తి కేంద్రం అగ్నికి పూర్తిగా ఆహుతైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో అదే భవనంలో ఉన్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement