
రుణమాఫీపై అసెంబ్లీలో స్పష్టత కరువు
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందని ఎమ్మెల్యే పోతుల రామారావు అన్నారు.
* ప్రభుత్వ విధానాలతో రైతులకు ఇబ్బందులు
* కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు
కందుకూరు : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందని ఎమ్మెల్యే పోతుల రామారావు అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టుహౌస్‌లో ఆయన మాట్లాడారు. అసలు రుణమాఫీ ఎవరిక వరిస్తుంది? ఎంత మందికి రుణమాఫీ చేశారు? రుణమాఫీ కోసం ఏ విధానం అమలు చేశారనే దానిపై ఇప్పటికీ నిర్దిష్ట విధానం లేదన్నారు. రైతులు బ్యాంకులు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వ స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యానశాఖ నిర్లక్ష్యంపై అసహనం
రైతులకు లాభాలు వచ్చేలా మామిడిలో నూతన వంగడాలు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రెండు నెలల నుంచి ఉద్యానవన శాఖ అధికారులను కోరుతుంటే అధికారులు రేపుమాపు.. అంటూ తప్పించుకు తిరుగుతున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆశాఖ ఏడీఏతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే గతంలో చెప్పిన ప్రణాళికలను తయారు చేశారా.. అని ప్రశ్నించారు. జనవరి మొదటి వారంలో చేస్తామని ఏడీఏ చెప్పడంతో ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేకు ఫిర్యాదుల వెల్లువ
అసెంబ్లీ సమావేశాల అనంతరం నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యేను నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలిసి సమస్యలు చె ప్పుకున్నారు. సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.