breaking news
MLA pothula Rama Rao
-
గూడు చెదిరిపోయే..గుండెలదిరిపాయే!
కందుకూరు అర్బన్: కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు నిరంకుశ పాలన పరాకాష్టకు చేరింది. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అన్న క్యాంటీన్ పేరుతో పేదల పొట్టకొట్టారు. పట్టణంలోని పాత చేపల మార్కెట్ వద్ద ఉన్న బంకుల తొలగింపుపై వారం రోజులుగా రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం మున్సిపల్ కమిషనర్ కె.అనూష పోలీసు బలగాలతో బంకుల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే బంకులు తొలగించాలని కమిషనర్‌ను కోరారు. అన్న క్యాంటీన్‌కు అవసరమైన స్థలం పోను మిగిలి ఉన్న ఫుట్‌పాత్‌పై, లేదా గుండం కట్టపై బంకులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయినా కమిషనర్ పట్టించుకోలేదు. ముందు ఖాళీ చేయాల్సిందేని ఒత్తిడి చేయడంతో కనీసం ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే సమయం మించి పోయిందంటూ కమిషనర్ తక్షణమే బొంకులు తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అన్యాయం..అక్రమం అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల నుంచి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసుకుని నెలనెలా బిల్లులు కట్టడంతో పాటు 20 కుటుంబాలు మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా ఎందుకు పేదల పొట్టకొడుతున్నారని అధికారులను నిలదీశారు. క్యాంటీన్ 10 గదుల్లో నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలున్నా ప్రైవేటు వ్యక్తులకు స్థలాన్ని ధారాదత్తం చేయడం కోసం బంకులు తొలగించడం భావ్యం కాదన్నారు. కొంత సమయం ఇస్తే బంకులు తొలగిస్తామని చిరువ్యాపారులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నాయకులు అధికారులను నిలదీశారు. ఆందోళనకు దిగిన గౌస్, బాలకోటయ్య, రఫీతో పాటు మరి కొంతమందిని ఆరెస్టు చేసి పొన్నలూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో బంకులు గుల్ల చేసి బయటకు తరలించారు. స్థలం చూట్టూ కంచె నిర్మించారు. బంకుల్లో ఉన్న సామగ్రి కూడా తీసుకొనే సమయం ఇవ్వకుండా తొలగించడంతో రోడ్డున పడ్డామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్టేసింది ఇందుకేనా? బాధితులు తమకు జురిగిన అన్యాయంపై మండిపడుతున్నారు. బంకులు తొలగించొద్డని ఎమ్మెల్యేను కలిసి వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. ఆయనకు ఓట్లేసింది ఇందుకేనా అని నిలదీస్తున్నారు. వెంటనే బంకుల నిర్వాహకులకు నష్టపరిహారం చెల్లించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో యాసిన్, జిలానీ, మాజీ కౌన్సిలర్ ఖాదర్‌బాషా ఉన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గణేషం గంగిరెడ్డి, పంది కోటేశ్వరరావు, తన్నీరు రమేష్, నగళ్ల నారయ్య, సుల్తాన్, జహీంగీర్బాషా, జె.కోటేశ్వరరావు, సీపీఐ నాయకులు బి.సురేష్‌బాబు పాల్గొన్నారు. -
పోర్టు రావడం ఖాయం
ఎప్పుడొస్తుందో చెప్పలేం.. పోర్టు సర్వే సంస్థ రైట్స్ జాయింట్ జనరల్ మేనేజర్ ఎమ్మెల్యే పోతులతో రెండు గంటల పాటు సమావేశం కందుకూరు : రామాయపట్నంలో పోర్టు రావడం ఖాయమని, అయితే ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పలేమని ఆ పోర్టు ఏర్పాటుపై ప్రాథమిక సమాచారం సేకరించేందుకు వచ్చిన రైట్స్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ జాయింట్ జనరల్ మేనేజర్, సర్వే బృందానికి నాయకత్వం వహిస్తున్న బీఎస్ఆర్ శేషగిరిరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ గెస్టుహౌస్‌లో స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావుతో సర్వే బృందం దాదాపు రెండు గంటలపాటు సమావేశమైంది. ఎమ్మెల్యేతో సమావేశం అనంతరం శేషగిరిరావు మాట్లాడారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తామని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఎంత సరుకు రవాణా చేస్తున్నారు.. ఏయే రంగాల నుంచి సరుకు అధికంగా ఇతర పోర్టులకు తరలిపోతోంది.. రోజూ రోడ్డు మార్గం ద్వారా ఎన్ని కంటైనర్లు ప్రయాణిస్తున్నాయి.. ఏయో ప్రాంతాలకు ఈ పోర్టు అనుకూలంగా ఉంటుందనే పూర్తి సమాచారం సేకరిస్తామని తెలిపారు. దీని కోసం వివిధ శాఖల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే పోతుల రామారావును కలిశామని, ఆయన ఎంతో విలువైన సమాచారం ఇచ్చారని శేషగిరిరావు వివరించారు. మరో వారంలో సంస్థ నుంచి టెక్నికల్ టీం వచ్చి రామాయపట్నంలో పర్యటిస్తుందని వివరించారు. శేషగిరిరావుతో పాటు సంస్థ మేనేజర్ బీఎం ఆరోర, టెక్నికల్ ఆఫీసర్ ఆర్కే పాండే ఉన్నారు. పోర్టుతో ఉపయోగాలు వివరించా : ఎమ్మెల్యే పోతుల రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు వల్ల ఉపయోగాల గురించి శేషగిరిరావు బృందానికి వివరించానని ఎమ్మెల్యే పోతుల రామారావు తెలిపారు. రైట్స్ సంస్థ మూడు దశల్లో సర్వే చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని, టెక్నికల్ టీం, పర్యావరణానికి సంబంధించిన టీం పరిశీలన చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త వీరాస్వామి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, మాల్యాద్రి, రఫీ, నాయు డు, రహంతుల్లా, రెహమాన్ పాల్గొన్నారు. -
రుణమాఫీపై అసెంబ్లీలో స్పష్టత కరువు
* ప్రభుత్వ విధానాలతో రైతులకు ఇబ్బందులు * కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కందుకూరు : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందని ఎమ్మెల్యే పోతుల రామారావు అన్నారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ గెస్టుహౌస్‌లో ఆయన మాట్లాడారు. అసలు రుణమాఫీ ఎవరిక వరిస్తుంది? ఎంత మందికి రుణమాఫీ చేశారు? రుణమాఫీ కోసం ఏ విధానం అమలు చేశారనే దానిపై ఇప్పటికీ నిర్దిష్ట విధానం లేదన్నారు. రైతులు బ్యాంకులు, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వ స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ నిర్లక్ష్యంపై అసహనం రైతులకు లాభాలు వచ్చేలా మామిడిలో నూతన వంగడాలు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రెండు నెలల నుంచి ఉద్యానవన శాఖ అధికారులను కోరుతుంటే అధికారులు రేపుమాపు.. అంటూ తప్పించుకు తిరుగుతున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆశాఖ ఏడీఏతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గతంలో చెప్పిన ప్రణాళికలను తయారు చేశారా.. అని ప్రశ్నించారు. జనవరి మొదటి వారంలో చేస్తామని ఏడీఏ చెప్పడంతో ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదుల వెల్లువ అసెంబ్లీ సమావేశాల అనంతరం నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యేను నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలిసి సమస్యలు చె ప్పుకున్నారు. సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.