దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.
కర్నూలు : దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని కర్నూలు, కడప జాతీయ రహదారిలోని శోభాఘాట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అంజలి ఘటించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా గత ఏడాది ఏప్రిల్ 23వ తేదీన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడాది సంవత్సరికాన్ని 11 నెలలకే నిర్వహించే పద్ధతి ఉంది. కాగా వచ్చే నెల 23వ తేదీన ప్రజల సమక్షంలో శోభా నాగిరెడ్డి తొలి వర్థంతి వేడుకను నిర్వహించనున్నారు.