దొంగనోట్ల ముఠా అరెస్ట్ | Fake notes gang arrested | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల ముఠా అరెస్ట్

Feb 6 2016 6:35 PM | Updated on Aug 20 2018 4:27 PM

విశాఖ జిల్లా పాడేరు పోలీసులు శనివారం ఐదుగురు సభ్యులు గల ఓ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు.

పాడేరు రూరల్ : విశాఖ జిల్లా పాడేరు పోలీసులు శనివారం ఐదుగురు సభ్యులు గల ఓ దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా పాడేరు మండలం నక్కలపుట్టు మామిడి తోటల వద్ద దొంగనోట్లను మార్పిడి చేసేందుకు వేచి ఉండగా.. సమాచారం అందుకున్న పాడేరు ఎస్‌ఐ సూర్యప్రకాశ్ సిబ్బందితో కలసి శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రూ.1.95 లక్షల విలువైన దొంగనోట్లు, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఉన్న ఓ రాగి నాణెం, ఐదు సెల్‌ఫోన్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో బి.వెంకట సత్యనారాయణ, కె.దుర్గారావు, బి. ప్రభాకర్‌రావు, బి.వెంకటరవికుమార్, ఆర్. అనిల్‌కుమార్ ఉన్నట్టు ఎస్‌ఐ సూర్యప్రకాశ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement