3,270 లీటర్ల ఊట సారా ధ్వంసం | Excise officials raid | Sakshi
Sakshi News home page

3,270 లీటర్ల ఊట సారా ధ్వంసం

Sep 3 2015 3:24 PM | Updated on Sep 5 2018 8:43 PM

వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ముద్దనూర్లలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.

వైఎస్సార్ (పులివెందుల) : వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ముద్దనూర్లలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసి 3,270 లీటర్ల ఊట సారా ధ్వంసం చేశారు. అలాగే 65 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి తొమ్మిది కేసులు నమోదు చేసి నలుగురిని  అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement