విశాఖలోని పాడేరు మండలం లింగాపూట్‌లో గిరిజనులు అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.
పాడేరు: విశాఖలోని పాడేరు మండలం లింగాపూట్‌లో గిరిజనులు అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. గంజాయి తోటలకు నిప్పు పెట్టి ధ్వంసం చేస్తుండగా గ్రామస్తులు అధికారులపై దాడికి యత్నించారు. దీంతో సీఆర్‌పీఎఫ్ పోలీసుల రాకతో గ్రామస్తులు పరారయ్యారు. గంజాయి పంటను సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.