స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు

Ex MPTC Abusing Comments On Speaker Tammineni Sitaram In Srikakulam - Sakshi

కూన సమక్షంలో నోరు పారేసుకున్న మాజీ ఎంపీటీసీ

కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌

సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): ప్రభుత్వ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి కేసుల పాలయ్యారు.. ముఖం చూపించే ధైర్యం లేక దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపారు.. ఎట్టకేలకు ముందస్తు బెయిల్‌ సంపాదించి మాజీ విప్‌ కూన రవికుమార్‌ స్వస్థలానికి వచ్చారు.. ఏదో ఘన కార్యం సాధించినట్టు అతని అనుయాయులు స్వాగత సన్నాహాలు చేశారు. స్థానిక ఎస్‌ఎస్‌ఎన్‌ కళ్యాణమండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కూన సమక్షంలోనే ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది మళ్లీ మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. కూన రవికుమార్‌ తొలుత ర్యాలీగా పట్టణంలోకి రావాలని భావించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాహనాలతో స్థానిక ఎస్‌ఎస్‌ఎన్‌ కళ్యాణమండపానికి చేరుకున్నారు.

అక్కడ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను రెచ్చగొడుతూ కొంతమంది మాట్లాడారు. ఆమదాలవలస మండలంలోని కనుగులవలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నూక సూరప్పల నాయుడు అలియాస్‌ రాజు స్పీకర్‌ తమ్మినేని సీతారాంను, ఆయన హోదాను కించపరిచే విధంగా కార్యకర్తల ముందు మైక్‌లో రెచ్చిపోయారు. స్పీకర్‌ తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ సర్టిఫికేట్‌లు కొనుగోలు చేసి చదువుకున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని విమర్శించి, పత్రికలో రాయలేని విధంగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడి మాటలు రికార్డ్‌ అయి ఉన్నాయని, ఆయనపై క్రిమినల్‌ కేసు పెట్టి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top