'వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా తెలంగాణ రాదు' | Errabelli Dayakar rao illiterate person, says tdp MP CM Ramesh | Sakshi
Sakshi News home page

'వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా తెలంగాణ రాదు'

Nov 15 2013 12:48 PM | Updated on Sep 27 2018 5:59 PM

టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు చదువు సంస్కారం లేని వ్యక్తిగా ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ అభివర్ణించారు.

టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఎర్రబెల్లికి చదువు సంస్కారం లేని వ్యక్తిగా సీఎం రమేష్ అభివర్ణించారు. అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా ఎలా విభజిస్తారని ఆయన ఎర్రబెల్లిని ప్రశ్నించారు. 100 మంది ఎర్రబెల్లిలు వచ్చిన తెలంగాణ రాదని రమేష్ వ్యాఖ్యానించారు.  ఆర్టికల్ 371 (డి)పైన పార్టీ అనుమతితోనే సుప్రీం కోర్టులో కేసు వేసినట్లు సీఎం రమేష్ వివరించారు.

 

తెలుగుదేశం పార్టీలో వార్డు మెంబర్గా విజయం సాధించలేని సీఎం రమేష్ను రాజ్యసభ సభ్యులను చేయడం దురదృష్టకరమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో సీఎం రమేష్కు చెందిన కాంట్రాక్ట్ పనులను అడ్డుకుంటామని ఎర్రబెల్లి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి వ్యాఖ్యలపై సీఎం రమేష్ పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement