
నీటి సమస్య తీర్చమన్నందుకు ఈవో దాడి
మా వీధిలో నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. బోరు వేసి నీళ్లు ఇవ్వాలని అడిగేందుకు పంచాయతీ కార్యాలయానికి
పంచాయతీ ఆఫీసును ముట్టడించిన
ఆర్యవైశ్యులు పరిస్థితి ఉద్రిక్తం
పోరుమామిళ్ల : మా వీధిలో నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. బోరు వేసి నీళ్లు ఇవ్వాలని అడిగేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన ఓ యువకుడిని పంచాయతీ కార్యదర్శి కాలితో తన్నడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై 8-30కి ఎస్సై రంగప్రవేశం చేసి కార్యదర్శిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకపోవడంతో మొత్తం సీన్ స్టేషన్‌కు చేరింది. ఆర్యవైశ్య మహిళలు భారీగా తరలిరావడంతో పరిస్థితి తీవ్రస్థాయికి వెళ్లింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి. పట్టణంలోని వైశ్యాబజారులో చేతిపంపు చెడిపోవడంతో నీళ్లు సక్రమంగా రావడం లేదని, పట్టణ శివార్లలో వేసిన బోరులో నీళ్లు పడ్డాయని తెలిసిన ఆర్యవైశ్యులు రాత్రి పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు.
కార్యదర్శి ముజఫర్ రహీమ్‌తో మా వీధిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. దీంతో ఈవోతో వైశ్యులకు మాటా మాటా పెరిగింది. ఈఓ పెడసరంగా మాట్లాడ్డంతో పలుకూరి కుమార్ అనే యువకుడితో వాగ్వివాదం జరిగింది. రెచ్చిపోయిన ఈవో రహీమ్ లేచి కాలితో కుమార్‌ను తన్నడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విషయం అందరికీ తెలియడంతో ఆర్యవైశ్యులు అక్కడకు చేరుకున్నారు. వారికి ఈవోకు మద్దతుగాఉన్నవారు, సిబ్బంది, కొందరు వార్డు సభ్యుడు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు.
ఓ దశలో ఈవోతో కుమార్‌కు క్షమానణ చెప్పించే ప్రయత్నం జరిగింది. ఇంతలోనే వైశ్యమహిళలు భారీగా అక్కడకు చేరడంతో మళ్లీమొదటికి వచ్చింది. ఈ సమాచారం తెలిసి చేరుకున్న పోలీసులు అందరినీ బయటకు పంపించారు. ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్ అక్కడకు చేరుకుని ఈవోను జీబులో ఎక్కించుకుని వెళ్లడంతో మొత్తం సీన్ స్టేషన్‌కు మారింది. న్యాయం జరక్కపోతే ధర్నాకు కూర్చుంటామని వైశ్యులు స్పష్టం చేశా రు. ఘర్షణ తెలిసి సర్పంచ్ హబీబున్నీసా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షిస్తుండగానే రంగం స్టేషన్‌కు మారింది. ఎస్సై సూచన మేరకు ఈవోపై ఫిర్యాదు ఇస్తున్నట్లు తెలిసింది.