వైఎస్ జగన్ కేసులోదర్యాప్తు పూర్తి | Enquiry completed, CBI says in YS Jagan's case | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ కేసులోదర్యాప్తు పూర్తి

Published Sat, Sep 21 2013 4:13 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తయిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది.

ప్రత్యేక కోర్టుకు నివేదించిన సీబీఐ
 సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తయిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. ఈ మేరకు సోమవారం కోర్టుకు రాతపూర్వకంగా నివేదిస్తామని తెలిపింది. కొన్ని అంశాల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉందని గతంలో సీబీఐ చెప్పిందని, దీంతో దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ గతంలో నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్లపై కోర్టు వాదనలు విని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

అయితే శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో నిందితుల తరఫు న్యాయవాదులు... కొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో దర్యాప్తు పురోగతిని స్పష్టం చేయాలని న్యాయమూర్తి సీబీఐ తరఫున న్యాయవాది సురేంద్రను ప్రశ్నించారు. ఈ కేసులో అన్ని అంశాల్లో దర్యాప్తు పూర్తయ్యిందని సురేంద్ర నివేదించారు. వాన్‌పిక్ కేసు సహా ఇతర అంశాల్లో ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ దాఖలుచేయబోమని చెప్పారు. అయితే ఇదే విషయంతో మెమోను కోర్టులో దాఖలు చేయాలని సురేంద్రకు న్యాయమూర్తి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement