'ఎర్రస్మగ్లర్ల ఆస్తుల్ని జప్తు చేస్తాం' | End to red sanders smuggling soon: DGP | Sakshi
Sakshi News home page

'ఎర్రస్మగ్లర్ల ఆస్తుల్ని జప్తు చేస్తాం'

May 23 2016 7:58 PM | Updated on Sep 4 2017 12:46 AM

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ జెవి రాముడు తెలిపారు.

-డీజీపీ జెవి రాముడు

తిరుపతి (చిత్తూరు జిల్లా)
: ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ జెవి రాముడు తెలిపారు. ఎంతటివారైనా ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం మహానాడు ప్రాంగణ భద్రతను పరిశీలించేందుకు వచ్చిన రాముడు విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త చట్టం ప్రకారం ఎర్రచందనం నిందితులపై పోలీసులు కఠినమైన కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా చేయవచ్చునన్నారు.

మునుపటిలాగా వెంటనే బెయిల్ రాకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నవారి సంపద ఏ రూపంలో ఉన్నా వదిలేదని లేదన్నారు. ఇకపై ఎర్రచందనం కేసులు ప్రూవ్ అయితే సుమారు ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడుతుందన్నారు. మహానాడుకు అతిరథమహారాథులు విచ్చేయనున్నారని వీరిలో జడ్‌ క్యాటగిరి కలిగినవారు కూడా ఉన్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement