నెలాఖరులో పీజీ డెంటల్ కౌన్సెలింగ్ | end of the Month PG Dental Counseling | Sakshi
Sakshi News home page

నెలాఖరులో పీజీ డెంటల్ కౌన్సెలింగ్

May 13 2014 11:44 PM | Updated on May 24 2018 1:47 PM

మెడికల్, డెంటల్ పీజీ, డిప్లమో కోర్సుల్లో 2014-15 సంవత్సరం అడ్మిషన్లకుగాను కౌన్సెలింగ్ నిర్వహించేందుకు స్థానిక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 విజయవాడ, మెడికల్, డెంటల్ పీజీ, డిప్లమో కోర్సుల్లో 2014-15 సంవత్సరం అడ్మిషన్లకుగాను కౌన్సెలింగ్ నిర్వహించేందుకు స్థానిక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల చివరి వారంలో పీజీ డెంటల్, జూన్ మొదటి వారంలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌లోనే మెడికల్ పీజీకి సంబంధించి రెండో విడత, అవసరమైతే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement