నిరుద్యోగులకు.. ఉద్యోగాల వేదిక | Employment Exchange In Online applications | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు.. ఉద్యోగాల వేదిక

Mar 27 2018 11:34 AM | Updated on Mar 27 2018 11:35 AM

Employment Exchange In Online applications - Sakshi

నిడమర్రు : కాలం మారింది.. అంతా కంప్యూటర్‌ యుగం నడుస్తుంది. నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజ్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొంచెం కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నా అన్ని రకాల ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానంతో తప్పాయి. గత కొంతకాలంగా నిరుద్యోగుల నుంచి ఏపీ ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజ్‌ కూడా ఆన్‌ లైన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

గతంలో అర్హతలుంటేనే కాల్‌ లెటర్స్‌
గతంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజ్‌లో పేర్లు నమోదు చేసుకునేవాళ్లు. అప్పుడు వాళ్ల అర్హతలకు తగిన అవకాశాలు ఉంటేనే ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ వచ్చేది. ఇప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అనుగుణంగా ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజ్‌ డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌ను అధికారులు రూపొందించారు. ఇప్పటికే రకరకాల పోర్టళ్లలో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేసి నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందినవారు అనేకమంది ఉంటారు. అలాంటి వారికోసం ఈ వెబ్‌సైట్‌ మంచి అవకాశాలు కల్పిస్తుంది.

ఏపీలోని ఉద్యోగ సమాచార వేదికగా..
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఈ వెబ్‌పోర్టల్లో ఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుని, తమ రెజ్యూమ్‌ను అప్‌లోడ్‌ చేస్తే సరి పోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఆయా జిల్లాలు, నియోజకవర్గం, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం కూడా తెలుస్తుంది.

ప్రైవేటు ఉద్యోగాల సమాచారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్ల సమాచారం అంతా ఈ వెట్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్‌ చెల్లించాల్సిన అవసరంలేదు. అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
ఉద్యోగాలు అవసరమైన కంపెనీ/సంస్థలు/రిక్రూటర్లు కూడా ఈ సైట్‌లో తమకు అవసరమైన ఖాళీలు గురించి వెబ్‌సైట్‌లో పొందుపరిచే అవకాశం కల్పించారు. దీంతో ఆయా అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఆ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు.

వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ ఇలా..
అభ్యర్థులు ముందుగా ఏపీ ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజ్‌ అధికారిక వెబ్‌సైట్‌ నందు లాగిన్‌ అవ్వాల్సి ఉంది. www.apemploymentexchange.com లాగిన్‌ అయ్యాక కనిపించే వెబ్‌సైట్‌ ముఖచిత్రంలో ‘న్యూ జాబ్‌ రిజిస్ట్రేషన్‌ హియర్‌’ వద్ద క్లిక్‌ చేయాలి. జాబ్‌ సీకర్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తు కనిపిస్తుంది. అక్కడ పేరు, ఈ– మెయిల్, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. తర్వాత కాలం వద్ద పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకుని నమోదు చేయాలి. పక్క కాలంలో రీ టైప్‌ పాస్‌వర్డ్‌ వద్ద తిరిగి క్రియేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. జిల్లా, చిరునామా, పిన్‌కోడ్‌ నమోదు చేయాలి. తర్వాత మీ సర్టిఫికెట్స్‌ ఆప్‌లోడ్‌ చెయ్యాల్సిన కాలం కనిపిస్తుంది. అక్కడ స్కేన్‌ చేసిన సర్టిఫికెట్స్‌ (5 కేబీ లోపు) అక్కడ సూచించిన ఫార్మెట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత వెరిఫికేషన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత సబ్‌మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.  తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా నమోదు చేసిన ఈ–మెయిల్‌ ఐడీ, మీరు క్రియేట్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావచ్చు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement