కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది.
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఎనిమిది నెలల కుమారుడిని రూ. లక్షా 30 వేలకు కన్నతండ్రి విక్రయించాడు. ఆ విషయం తెలిసిన బాలుడి తల్లి మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా బాలుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.