ఎన్నికల అధికారులకు ఈసీఐ దిశానిర్దేశం

ECI Deputy Chief Umesh Sinha Meeting AP Election Officers In Amaravti - Sakshi

అమరావతి: ఎన్నికల ఫలితాల రోజున అనుసరించాల్సిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) డిప్యూటీ చీఫ్‌ ఉమేశ్‌ సిన్హా దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ నాడు చోటుచేసుకున్న సంఘటనలుల దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్‌ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ప్రణాళిక విభాగం రూపొందించిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని సూచించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. స్ట్రాంగ్‌ రూంల భద్రతపై వారాంతపు నివేదికలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా పంపించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు వివరాలు ఈసీఐ అధికారిక పోర్టల్‌ న్యూసువిధకు అనుసంధానం చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని తెలియజేశారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటించాలని సూచన చేశారు. 

రోజువారీ నివేదికలివ్వండి: సుజాత(అడిషల్‌ సీఈఓ)

స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై రోజువారీ నివేదికలివ్వాలని కలెక్టర్లను ఏపీ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిణి సుజాత శర్మ ఆదేశించారు. కౌంటింగ్‌ ప్రక్రియను ప్రోటోకాల్‌ ప్రకారం అత్యంత పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. 17న కౌంటింగ్‌పై రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తామని  చెప్పారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top