ఎంసెట్ కౌన్సెలింగ్ రెండవరోజు మంగళవారం కూడా జిల్లాలోని మూడు సెంటర్లలో ప్రశాంతంగా జరిగింది.
రెండోరోజూ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతం
Aug 21 2013 4:32 AM | Updated on Sep 1 2017 9:56 PM
ఖమ్మం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ రెండవరోజు మంగళవారం కూడా జిల్లాలోని మూడు సెంటర్లలో ప్రశాంతంగా జరిగింది. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం మండల పరిధిలోని రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, భద్రాచలం ఎటపాక ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాలలో కౌన్సెల్సింగ్ నిర్వహించారు. 15,001 నుంచి 30 వేల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు ఖ మ్మం లో 252 మంది, కొత్తగూడెంలో 70 మంది, భద్రాచలంలో 29 మంది మొత్తం 351 మంది హాజరై తమ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారు.
సీంమాధ్రలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కు వ్యతిరేకంగా సమ్మెలు, ఆందోళనలతో కౌన్సె లింగ్ నిలిచిపోయింది. ఉద్యోగులు, విద్యార్థి సం ఘాలు కౌన్సెలింగ్‌ను బహిష్కరించడంతో కృష్ణా, తూ ర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 61 మం ది విద్యార్థులు మన జిల్లాలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. బుధవారం జరిగే కౌన్సెలింగ్‌లో 30,001 నుంచి 45 వేల లోపు ర్యాంకు సాధించిన వారు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని ఎం సెట్ జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement