కంగుతిన్న చంద్రబాబు | DWCRA women questioned Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కంగుతిన్న చంద్రబాబు

Jul 17 2014 7:21 PM | Updated on Sep 29 2018 6:06 PM

చంద్రబాబు నాయుడు - Sakshi

చంద్రబాబు నాయుడు

బెల్ట్‌ షాపులు మూయించడని పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఈ రోజు జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

ఏలూరు: బెల్ట్‌ షాపులు మూయించడని పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఈ రోజు జరిగిన డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మహిళలు విజ్ఞప్తి చేశారు. బెల్ట్‌ షాపులు ఉన్నాయా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.  ఉన్నాయని మహిళలు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఎక్సైజ్‌శాఖ పనితీరు బాగాలేదని ఆగ్రహిం వ్యక్తం చేశారు.

డ్వాక్రా రుణాలమాఫీకి కట్టుబడి ఉన్నామని  చంద్రబాబు చెప్పారు. డబ్బులు కట్టినా, కట్టకపోయినా న్యాయం చేస్తామన్నారు. రుణమాఫీపై మాట తప్పేది లేదని చెప్పారు. టిడిపి  అధికారంలోకి రావడానికి  మహిళా చైతన్యమే కారణం అన్నారు. విభజన ద్యారా వచ్చిన నష్టాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. నూతన రాజధాని నిర్మాణానికి డ్వాక్రా సంఘాల మహిళలు 62 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు  అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement