డ్వాక్రాలకు బాబు టోకరా | Dvakra launches tokara | Sakshi
Sakshi News home page

డ్వాక్రాలకు బాబు టోకరా

Sep 19 2014 1:16 AM | Updated on Sep 29 2018 6:06 PM

ఎన్నడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలు టీడీపీ పాలనలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కొక్క సంఘానికి రూ.లక్ష రుణమాఫీ లేదని, 2013-14 సంవత్సరానికి రుణాలు...

  • కానరాని రుణమాఫీ  రూ.లక్ష సంఘనిధి పేరిట
  •   తాజా ఉత్తర్వులు కొత్త అప్పులివ్వడానికి
  •   బ్యాంకులు వెనుకంజ ఆందోళనలో మహిళలు
  • పాడేరు : ఎన్నడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలు టీడీపీ పాలనలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కొక్క సంఘానికి రూ.లక్ష రుణమాఫీ లేదని, 2013-14 సంవత్సరానికి రుణాలు పొందిన సంఘాలకు మాత్రం రూ.లక్ష చొప్పున సంఘ నిధి పేరిట జమ చేస్తామని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో డ్వాక్రా మహిళల్లో మరింత ఆందోళన ఏర్పడుతోంది. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని వెంటనే కొత్తరుణాలు కూడా పంపిణీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలంతా విస్తృత ప్రచారం చేశారు.

    కానీ అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు డ్వాక్రా రుణాల రద్దుపై తాత్సారం చేస్తుండడంతో ఏజెన్సీ డ్వాక్రా మహిళల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ముందే రుణమాఫీ ప్రచారం జరగడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను గత ఏడాది డిసెంబరు నుంచి చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరిగిపోయాయి.
     
    తాత్సారంతో గందరగోళం

    ఏజెన్సీలోని11 మండలాల పరిధిలో 9,900 డ్వాక్రా సంఘాలు ఉండగా 5,200 సంఘాలకు చెందిన మహిళలు రుణబాధితుల్లో ఉన్నారు. నాలుగేళ్ల నుంచి మొండి బకాయిలు రూ. 28 కోట్లు ఉండగా 2013-14 సంవత్సరానికి రూ.19 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం రూ.47 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. కానీ మొండి బకాయిలు రూ.28 కోట్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం గత ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాల రుణాలు పొందిన రూ.19 కోట్లకు సంబంధించి రుణమాఫీ చేయకపోగా సంఘ నిధి పేరిట వారి సంఘాలలో రూ. లక్ష జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ నిబంధనలతో రుణమాఫీకి ఆటంకం ఏర్పడింది.

    అయితే ఐకేపీ అధికారులు సెర్ప్ సంస్థకు ఇటీవల ఒక నివేదికను సమర్పించారు. సంఘ నిధి పేరిట జమ చేసే రూ.లక్షను నాలుగేళ్ల నుంచి రుణాలు పొందిన మొత్తం 5,200 సంఘాలకు అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని, ఈ నగదును రుణ బకాయిలకు జమ చేయవచ్చని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా సంఘాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం అధికారులను కూడా గందరగోళంలోకి నెట్టేసింది.
     
    కొత్త రుణాలకు బ్యాంకులు వెనుకంజ

    పాడేరు డివిజన్‌లో 800 కొత్త సంఘాలకు రూ.12 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసేందుకు ఐకేపీ ఏర్పాట్లు చేసినా అన్ని బ్యాంకుల అధికారులు ముందుకు రాకపోవడంతో మహిళలు రుణాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీపై ప్రభుత్వ తాత్సారం చేయడంతో ఈ కొత్త సంఘాల మహిళలు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా అధికారులు వెనుకంజ వేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement