దొనకొండను రాజధానిగా నిర్ణయించాలి | Donakonda to determine as the capital | Sakshi
Sakshi News home page

దొనకొండను రాజధానిగా నిర్ణయించాలి

Jul 28 2014 2:06 AM | Updated on Sep 2 2017 10:58 AM

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిగా ప్రకాశం జిల్లా దొనకొండను ఎంపిక చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి కోరింది.

శివరామకృష్ణన్ కమిటీకి రాయలసీమ రాజధాని సమితి వినతి

సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిగా ప్రకాశం జిల్లా దొనకొండను ఎంపిక చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి కోరింది. సమితి ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడు వినుకొండ రాజారావు నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీని కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం సమర్పించింది. దొనకొండ అందరికీ ఆమోదయోగ్యంగా, అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని వివరించింది. ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేయడానికి ఉన్న అనుకూల అంశాలను ఆ వినతిపత్రంలో వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement