ఆకస్మిక తనిఖీలు  | District SP Navdeep Singh Checks Police Stations In West Godavari | Sakshi
Sakshi News home page

ఆకస్మిక తనిఖీలు 

Aug 1 2019 10:19 AM | Updated on Aug 1 2019 10:19 AM

District SP Navdeep Singh Checks Police Stations In West Godavari - Sakshi

వన్‌టౌన్‌ స్టేషన్‌లో రికార్డు గదిని పరిశీలిస్తున్న ఎస్పీ నవదీప్‌సింగ్, చిత్రంలో ఏఎస్పీ ఈశ్వరరావు

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు పోలీసు శాఖ పనిచేయాలని, పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్‌ అన్నారు. ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, ఫిర్యాదుదారుల విభాగం, స్పందనకు వచ్చే ప్రజలకు అందించే సౌకర్యాలు తదితరాలపై ఆరా తీశారు. రికార్డ్‌ గది, కంప్యూటర్‌ రూమ్, స్టోర్‌ రూ మ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రాంగణంలో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని స్టేషన్లలో తాను తనిఖీలు చేపడతానన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరా వు, ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్, ఎస్‌బీ సీఐ రజ నీకుమార్, వన్‌టౌన్‌ సీఐ వై.బాలబాలాజీ, ఎస్సైలు ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు, ఎస్‌.రామకృష్ణ, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement