జోరు తగ్గిన రబీ | district Rabi area greatly reduced | Sakshi
Sakshi News home page

జోరు తగ్గిన రబీ

Feb 5 2014 3:07 AM | Updated on Oct 1 2018 2:00 PM

జిల్లాలో ఈసారి రబీ విస్తీర్ణం బాగా తగ్గింది. వరుస విపత్తులు, విపరీ తంగా పెరిగిన పెట్టుబడుల కారణంగా వ్యవసాయం అంటేనే అన్నదాతలు

 శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈసారి రబీ విస్తీర్ణం బాగా తగ్గింది. వరుస విపత్తులు, విపరీ తంగా పెరిగిన పెట్టుబడుల కారణంగా వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం సుమారు 17వేల హెక్టార్లు తగ్గింది. ఈ సీజనులో సాధారణ సాగు విస్తీర్ణం 1,08,675 హెక్టార్లు కాగా ఈసారి 91,682 హెక్టార్లలోనే  వివిధ రకాల పంట లు సాగు చేస్తున్నారు. అక్టోబర్‌లో కురిసిన వర్షాల కారణంగా ఉలవ పంట పూర్తిగా పాడైపోయింది. మినుము, పెసర పంటల విస్తీర్ణంలో బాగా తగ్గింది. దీనికి తోడు అక్టోబర్ వర్షాల తరువాత ఇంతవరకు జిల్లాలో చుక్క వర్షం కూడా పడలేదు. దీంతో రైతులు రబీ పంటలపై పూర్తిగా ఆశ వదులుకున్నారు. తుఫాన్లకు నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలోని కాలువలు దెబ్బతినడంతో వాటి మరమ్మతుల కోసం రబీలో నీటి సరఫరా ఉండదని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. 
 
 దీంతో కాలువల కింద పంటలు దాదాపు లేవు. వరి పంట సగానికి పైగా తగ్గింది. ఉలవ పంట సుమారు రెండు వేల హెక్టార్ల మేరకు తగ్గగా, వేరుశనగ, నువ్వులు. మొక్కజొన్న, చెరుకు పంటల సాగు విస్తీర్ణం మరో రెండు వేల హెక్టార్ల మేరకు తగ్గింది. ప్రభుత్వ విధానాలు, అనుకూలించని పరిస్థితులతో రైతులు పంటల సాగుపై నిరాస్తతతో ఉన్నారనేది దీనితో తేటతెల్లమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు జిల్లాలో పంటల సాగు ఇంకా తగ్గిపోయే ప్రమాదముందన్న ఆందోళన
  వ్యక్తమవుతోంది.
 
 రబీ సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)
 పంట సాధారణం 2012-13 2013-14 
 వరి 3507 2855 1064 జొన్న 2 - 21
 మొక్కజొన్న 3756 4370 3949
 రాగి 835 622 344
 కంది 5 - 13
 ఉలవ 6912 6288 4703
 పెసర 29078 31101 29807
 మినుము 42669 44005 41181
 నువ్వులు 4272 2828 846
 మిరప 2626 2239 1529
 చెరుకు 3799 3884 1684
 వేరుశనగ 7396 7103 4958
 సన్‌ప్లవర్ 2674 1829 630
 ఉల్లి 1144 933 953
 మొత్తం 108675 108057 91682
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement