ప్రతి ఒక్కరూ వికలాంగులను ఆదరించాలని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ రబ్బానీ పేర్కొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉపాధి హామీ పథకం, మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మిడ్జిల్, న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరూ వికలాంగులను ఆదరించాలని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ రబ్బానీ పేర్కొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉపాధి హామీ పథకం, మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికలాంగులను సన్మానించారు. అనంతరం రబ్బా ని మాట్లాడుతూ వికలాంగులను నేడు సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. శరీర లోపం మనిషి చేసుకున్నవి కావని దేవుడు ఇచ్చినవన్నారు. వారిని ప్రతి ఒక్కరూ ఆదరించి అభిమానించాలని కోరారు. వికలాంగు ల దినోత్సవం సందర్భంగా వారికి క్రీడలు నిర్వహిస్తే బా గుండేదని పేర్కొన్నారు.
అనంతరం వికలాంగులు పాడిన పాటలు పలువురిని కంట తడిపెట్టించాయి. వారు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. కార్యక్రమంలో తహశీల్దా ర్ సంగీత, ఎంపీడీఓ తిర్పతయ్య, మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్ జ్యోతి అల్వాల్‌రెడ్డి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రంగమ్మ, వైద్యాధికారి కరీముల్లా, రాష్ట్ర వికలాంగుల సంఘం ఉపాధ్యక్షుడు బాలకిష్టారెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ బాల మణి, ఏపీఓ నర్సిం హులు, ఏపీఎం మాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.