వికలాంగ పింఛన్ రూ.10 వేలు! | Disability pension of Rs 10 thousand! | Sakshi
Sakshi News home page

వికలాంగ పింఛన్ రూ.10 వేలు!

Dec 8 2013 3:41 AM | Updated on Sep 2 2017 1:22 AM

ఉన్న పింఛన్లకే కోత విధిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ వికలాంగుడి ఖాతాకు ఏకంగా రూ.10 వేల పింఛన్ జమ అయింది. మరో వ్యక్తికి సైతం రూ.2 వేల పింఛను వచ్చింది.

రేగిడి, న్యూస్‌లైన్:ఉన్న పింఛన్లకే కోత విధిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ వికలాంగుడి ఖాతాకు  ఏకంగా రూ.10 వేల పింఛన్ జమ అయింది. మరో వ్యక్తికి సైతం రూ.2 వేల పింఛను వచ్చింది. అనుమానం వచ్చిన బీపీఎం  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన తరువాతే..పంపిణీ చేయాలని నిర్ణయించారు. వివరాలివీ. కొండలమామిడివలస బ్రాంచి పోస్టాఫీసుకు జిల్లా అధికారుల నుంచి పింఛన్ల జాబితా శనివారం వచ్చింది. ఇందులో బావిశెట్టి మహి అనే వ్యక్తి పేరుతో  పదివేల రూపాయలు పింఛను డబ్బు లు మంజూరైనట్లు  ఉంది. ఆ వ్యక్తి ఖాతానెంబరు 22855769లో జమ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే 22856595 ఖాతానెంబరు పేరున నర్సమ్మ అనే వ్యక్తికి రెండు వేల రూపాయుల పింఛన్ వచ్చింది. వీటిని పరిశీలించిన బీపీఎం పొదిలాపు రామినాయుడు  అవాక్కయ్యారు.  అధికంగా సొమ్ము జమకావడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ ఇద్దరు లబ్ధిదారులు ఏ గ్రామం వారో తెలియడం లేదని పేర్కొన్నారు. 
 వాస్తవమిదీ..
 
 వాస్తవానికి ఎవరైనా లబ్ధిదారు వరుసగా మూడు నెలల పాటు పింఛను తీసుకోకపోతే..వారి పింఛను రద్దవుతుంది. కానీ  నర్సమ్మకు నాలుగు నెల లకు సంబంధించిన పింఛన్ పేరిట సొమ్ము జమ అయిందని బీపీఎం తెలి పారు. ఉన్నతాధికారుల  సూచన మేర కే పంపిణీ చేస్తామని చెప్పారు. విషయాన్ని జిల్లా పింఛన్ల అధికారి సోమయాజుల వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా.. గతంలో కొంతమందికి పింఛన్లు మంజూరై అనంతరం నిలిచిపోయాయని, వారంతా సదరంకు వచ్చి, అంగవైకల్యం ధ్రువీకరణ పత్రాలు పొందారని చెప్పారు. అందువలేల  పెండింగ్ లో ఉన్న పింఛన్ నిధులు కూడా  విడుదలయ్యాయని పేర్కొన్నారు.  
 
 

 

Advertisement
 
Advertisement
Advertisement