అశ్రునయనాలతో ‘ధర్మవరపు’ అంత్యక్రియలు | Dharmavarapu Subramanyam Death Funeral At Prakasam District | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో ‘ధర్మవరపు’ అంత్యక్రియలు

Dec 10 2013 2:32 AM | Updated on Jun 4 2019 5:04 PM

అశ్రునయనాలతో ‘ధర్మవరపు’ అంత్యక్రియలు - Sakshi

అశ్రునయనాలతో ‘ధర్మవరపు’ అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండలోని ఆయన ఫామ్‌హౌస్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగాయి.

 అద్దంకి, న్యూస్‌లైన్: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండలోని ఆయన ఫామ్‌హౌస్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగాయి. ధర్మవరపు భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
 
  ధర్మవరపు పార్థివదేహాన్ని అద్దంకిలోని ఆయన స్వగృహం నుంచి శింగరకొండ ఫామ్‌హౌస్‌కు ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రెండు గంటలకు శింగరకొండ ఫామ్‌హౌస్‌కు చేరింది. ధర్మవరపు కుమారుడు రోహన్ సందీప్ ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement