‘అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలి’

Dharmana Krishna Das Review Meeting On Agriculture Departments - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు ఉంటే త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అధికారులను ఆదేశించారు. ఒడిశాలో వర్షాలు పడితే మనకు ముంపు వస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ శాఖల సమన్వయంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులంతా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మాట్లాడాలని, రైతులు సకాలంలో విత్తనాలు వేసేలా చూడాలని తెలిపారు.(వలస కార్మికులపై రాజకీయాలు )

సాగునీటి చెరువులు ప్రణాళికాబద్ధంగా నింపాలని, రైతులకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేసి ఆదుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది విత్తనాలు ముందే సరఫరా చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం అతిముఖ్యమైన విషయమని, రైతులకు అండగా ఉండాలని సూచించారు. ఏడాది అంతటా పండించే పంట చేతికి రావాలన్నారు. అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వ్యవసాయానికి ఇదే సరైన సమయమని, రైతులకు పంట యాజమాన్య పద్ధతులు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఏడాది అధిక దిగుబడులు రావాలని, మార్కెటింగ్ సదుపాయాలు తెలియజేయాలన్నారు. (సోష‌ల్ మీడియాలో ట‌న్నుల కొద్దీ హింస‌)

వ్యవసాయ, జలవనరుల శాఖలు చేపడుతున్న ప్రతి చర్య రైతుల పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో వంశధార కింద 2.50 లక్షల ఎకరాలకు ప్రతి ఏడాది నీటి సరఫరా చేయాలన్నారు. గత ఏడాది జూలై రెండవ వారంలో నీరు విడుదల చేశామని, ఈ ఏడాది జూన్ 2 లేదా 3వ వారం నీటి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నారాయణ పురం, తోటపల్లి, మడ్డువలస నుంచి జూన్ నెలలో విడుదల చేసే అవకాశముందన్నారు. విత్తనాలు పంపిణీలో చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ సహాయకుల ద్వారా రైతుల పేర్లు నమోదు చేస్తామని, రైతు భరోసా కేంద్రాలు మే 30 నాటికి సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. (ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top