డీజీపీ స్థాయికి సిటీ కొత్వాల్ పోస్టు | DGP to the level of City Kotwal post | Sakshi
Sakshi News home page

డీజీపీ స్థాయికి సిటీ కొత్వాల్ పోస్టు

May 29 2014 12:11 AM | Updated on Aug 21 2018 7:58 PM

హైదరాబాద్ పోలీసు కమిషనర్ పోస్టుకు తాత్కాలికంగా ఎక్స్-క్యాడర్‌లో డీజీపీ స్థాయికి పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తాత్కాలికంగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం

 హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనర్ పోస్టుకు తాత్కాలికంగా ఎక్స్-క్యాడర్‌లో డీజీపీ స్థాయికి పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా)లోనూ అదనపు డీజీ స్థాయిలో స్పెషల్ డెరైక్టర్ పోస్టునూ తాత్కాలికంగా అప్‌గ్రేడ్ చేసింది. రెండేళ్లుగా నగర పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ ఈ ఏడాది ఏప్రిల్‌లో డీజీపీగా పదోన్నతి పొందారు.

అయినప్పటికీ అదే పోస్టులో కొనసాగుతుండటంతో సాంకేతిక కారణాలతో ఆయన జీతభత్యాల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అదనపు డీజీ స్థాయిలోనే ఉన్న ఎం.మహేందర్‌రెడ్డిని జూన్ 2న నగర పోలీసు కమిషనర్‌గా  నియమిస్తారని తెలుస్తోంది. ఆ సందర్భంలో ఈ పోస్టును యథాస్థితికి తెస్తూ ప్రభుత్వం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement