జాబ్ పేరుతో వికృత చేష్టలు, డీఎఫ్‌వోపై బదిలీ వేటు! | DFO Mohanrao accused of harassment charges transferred! | Sakshi
Sakshi News home page

లైంగిక ఆరోపణలు, డీఎఫ్‌వోపై బదిలీ వేటు!

Jul 4 2019 2:55 PM | Updated on Jul 4 2019 3:02 PM

DFO Mohanrao accused of harassment charges transferred! - Sakshi

సాక్షి, అమరావతి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా అటవీశాఖాధికారి డీఎఫ్‌వో మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఆరోపణలపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నత అధికారులను విద్యుత్‌, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నివేదిక రాగానే డీఎఫ్‌వోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పస్టం చేశారు. కాగా అటవీశాఖలో కాంట్రాక్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని మోహన్‌రావు ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేయడంతో పాటు కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు లేదు.. ఉద్యోగమూ లేదని చెప్పడంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మంత్రి బాలినేని సదరు అధికారిని బదిలీ చేయాలంటూ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు.

చదవండిఉద్యోగం పేరుతో వికృత చేష్టలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement