దుర్గగుడిలో మంత్రి దేవినేనికి చుక్కెదురు

Devotees Serious On Minister Devineni Uma Over Durga Temple Problems - Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో మంత్రి దేవినేని ఉమకు చుక్కెదురైంది. సాధారణ భక్తులు వెళ్లే క్యూలైన్‌లో కొండపైకి వచ్చిన మంత్రి ఉమని.. ఓ భక్తురాలు సమస్యలపై నిలదీసింది. క్యూలైన్‌లో ఉన్న మంత్రి ఉమ గుడిలోని సదుపాయాల గురించి భక్తులను అడుగగా.. క్యూలైన్ల నిర్వహణ గందరగోళంగా ఉందని, గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఓ మహిళా భక్తురాలు అసహనం వ్యక్తం చేసింది. వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో జవాబు చెప్పలేక పోయిన మంత్రి సమయం అవుతోందంటూ గుడిలోకి వెళ్లిపోయారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మంత్రి ఈ మాత్రానికే క్యూలైన్లలో రావటం, సమస్యలు ఉన్నాయా అని అడగటం ఎందుకని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top