చెవిరెడ్డితోనే చంద్రగిరి అభివృద్ధి

 Development Of Chandragiri With Chevireddy - Sakshi

సాక్షి, పాకాల: ఓటు హక్కు దుర్వినియోగం చేసుకోకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వదిన సునీతమ్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం మండలం లోని శంఖంపల్లి, శంఖంపల్లి హరిజనవాడ, పులివర్తివారిపల్లి, పులివర్తివారిపల్లి ఎస్సీ కాలనీ, తాటిమాకులపల్లి, ఆదినపల్లి గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ప్రజాస్వామికంగా ఎవరి ఓటు ను వారే వినియోగించుకునేందుకు వచ్చిన మంచి అవకాశమన్నారు.

ఎవరికీ భయపడకుం డా ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిత్యం దళితుల అభ్యున్నతికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముందుం టారని, కార్యకర్తలకు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ముందుండి సమస్యను పరిష్కరించే వ్యక్తి ్డత్వం ఉండే నాయకుడని గుర్తు చేశారు. ఈ నెల 19వ తేదీన రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారని, తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్‌ గుర్తు పై వేసి మరొక్కసారి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
ఓటర్లకు అండగా ఉంటాం
రామచంద్రాపురం: మండలంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామాపురం గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప శుక్రవారం ప్రచారం చేశారు. అగ్రవర్ణాల వారు తమపై దాడికి పాల్పడుతున్నారని దళితులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ భయపడకండి అండగా ఉంటా మని, ఓటును నిర్భయంగా వినియోగించుకోండని వారికి భరోసా ఇచ్చారు.

ఎన్నికల అనంతరం కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 60 సం వత్సరాలు గడుస్తున్నా ఓటు వేయకపోవడం బాధాకరమన్నారు. ఆదివారం జరిగే ఎన్నికలలో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు దామోదర్‌రెడ్డి, యోగానందరెడ్డి, గోపీచౌదరి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చెవిరెడ్డితోనే చంద్రగిరి అభివృద్ధి
రామచంద్రాపురం: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్‌ఆర్‌ సీపీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రీపోలింగ్‌లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top