‘ముస్లిం సోదరులు ప్రభుత్వానికి సహకరించాలి’

Deputy CM Amjad Basha Talks In Press Meet Over Ramzaan - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: పవిత్రమైన రంజాన్‌ పండుగ కరోనా వైరస్‌ సమయంలో వచ్చినందున్న.. ముస్లిం సోదరులంతా ప్రభుత్వానికి సహకరించాలని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా రానున్న రంజాన్‌ దీక్షల తరుణంలో అందరూ ఇళ్లలోనే నమాజ్‌ నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఇక కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రంజాన్‌ ఉపవాస దీక్షలలో 5 పూటలా నమాజ్‌ చేయడానికి ఇమామ్‌, మౌజన్‌లకు అనుమతిని ఇస్తున్నామని, నమాజ్‌కు సంబంధించిన అజా సమయంలో సైరన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇనుమతించిందన్నారు. (వైన్‌ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి)

ఇక సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించే సమయంలో ఎవరూ బయటకు రావోద్దని, ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని ఇఫ్తార్‌ జరుపుకోవాలన్నారు. నమాజ్‌ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల దుకాణౠలు ఉదయం 10 వరకు అనుమతి ఇస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే  ఉపవాస దీక్ష విరమణ సమయంలో పండ్లు, ఫలాల కోసం సాయంత్రం వేళ దుకాణాలకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. పేద ముస్లిం వాళ్లకు దాతలు చేసే ఉచిత అన్నదాన కార్యక్రమం అనుమతితో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇఫ్తార్‌ సమయంలో పోలీసులు అనుమతిని ఇచ్చిన కొన్నిహోటల్స్‌కు మాత్రమే టెక్‌ అవెతో వేసులు బాటు కల్పించామన్నారు. క్వారంటైన్‌లో ఉన్న ముస్లిం సోదరులకు ప్రభుత్వ యంత్రాంగం తరపున వారికి పౌష్టికాహారం అందిస్తున్నామని, అన్ని ప్రాంత్రాల్లో ప్రభుత్వ నిబంధనల బ్యానర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top