‘రైతులను వాడుకొని మొండిచేయి చూపాడు’ | Deputy CM Alla Nani Opened the Grain Buying Center at the Eluru Market Yard | Sakshi
Sakshi News home page

‘రైతులను వాడుకొని మొండిచేయి చూపాడు’

Nov 23 2019 2:22 PM | Updated on Nov 23 2019 2:40 PM

Deputy CM Alla Nani Opened the Grain Buying Center at the Eluru Market Yard - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లా కేంద్రమైన ఏలూరు మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ఆళ్లనాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా.. గత టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఆరోపించారు. రైతలను ఎన్నికలకు వాడుకుని వారికి మొండిచేయి చూపిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందుతుందన్నారు. జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాలను మహిళల ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. రైతు భరోసా అమలు చేసి లక్షలాది మంది రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు. కొమడవోలు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు ఇస్తామని ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement