తీవ్రవాయుగుండంగా మారనున్న వాయుగుండం | Depression turns deep depression, says indian meteorological department | Sakshi
Sakshi News home page

తీవ్రవాయుగుండంగా మారనున్న వాయుగుండం

Nov 20 2013 9:07 AM | Updated on Sep 2 2017 12:48 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రేపు చెన్నై - ఒంగోలు మధ్య తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయిని, అలాగే గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

 

సముద్రంలో వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని నౌకాశ్రయాల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement