కరోనా వైరస్‌: డేజంర్‌ జర్నీ

Delhi Prayers Coronavirus Suspects In Kurnool District - Sakshi

ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారితో పొంచిఉన్న పెనుముప్పు

వారిలో జిల్లా వాసులే అధికం.. 258 మంది గుర్తింపు

క్వారంటైన్‌ సెంటర్లకు తరలింపు

వారు తిరిగిన ప్రాంతాలు, సన్నిహితులపై ఆరా

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

సాక్షి, కర్నూలు: కరోనావైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారికి లాక్‌డౌన్, క్వారంటైన్‌తో కళ్లెం వేయాలని చూసిన ప్రభుత్వం, జిల్లా యంత్రాంగానికి కొత్త సమస్య ఎదురైంది. ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు పలు జిల్లాల్లో తేలడం, అక్కడికి వెళ్లొచ్చిన వారిలో అన్ని జిల్లాల కంటే కర్నూలు వాసులే అధికంగా ఉండటంతో అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై..రానున్న పెనుముప్పును నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీని నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు చేర్చిన అధికారులు.. వారి సన్నిహితులు, నివాస ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. (అమెరికాను వణికించిన భూకంపం )

కరోనా వైరస్‌ విదేశాల నుంచి వస్తున్న వారితో ఇండియాలో వ్యాపిస్తోందని ప్రాథమిక దశలో గుర్తించిన ప్రభుత్వం వెంటనే వారిపై దృష్టి సారించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేయించడంతో పాటు అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచింది. అయితే ఆలస్యంగా వెలుగుచూసిన ఢిల్లీ ఘటన ఇతర ప్రాంతాలతో పాటు కర్నూలు జిల్లా వాసులనూ కలవరపెడుతోంది. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో కొందరికి కరోనా సోకడం, తెలంగాణలో మరణాలు కూడా సంభవించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.(కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి )

మన ప్రభుత్వం కూడా వెంటనే సర్వే చేయించింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో అత్యధికంగా కర్నూలు జిల్లా వాసులు 258 మంది ఉన్నట్లు ఇప్పటిదాకా గుర్తించారు. అందులోనూ కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఆదోని ప్రాంత వాసులు ఎక్కువగా ఉన్నారు. అదీగాక 60 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై.. వీరిని రాయలసీమ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీల్లోని క్వారంటైన్‌ సెంటర్లలో చేర్చుతోంది. ఇప్పటిదాకా 188 మందిని క్వారంటైన్‌కు తరలించింది. 43 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచింది.12 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు గుర్తించింది. మరో 15 మంది ఆచూకీ దొరకలేదు.

సర్కారు పటిష్ట చర్యలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడికి జిల్లా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఇప్పటి వరకూ 23 మందిని ఐసోలేషన్‌లో ఉంచి..వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా లేదని తేలింది. సంజామల మండలం నొస్సంలో ఉండే రాజస్థాన్‌ యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. మరో 9 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

ప్రస్తుత పరిస్థితిపై ఆరా
ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో ఎక్కువమంది కర్నూలు వాసులే ఉండటంతో ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

పెనుముప్పుపై అప్రమత్తం
ఢిల్లీ నుంచి వచ్చిన వారు 20 రోజులుగా జనం మధ్యనే తిరిగారు. ఒకవేళ వారికి పాజిటివ్‌ వస్తే వారి ద్వారా ఇంకెంతమందికి వ్యాపించి ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి తప్పిదాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లిన వారి కుటుంబ సభ్యులు సైతం హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారి సన్నిహితులపైనా దృష్టి సారించారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ముందస్తు జాగ్రత్తగా కర్నూలు సర్వజనాస్పత్రితో పాటు విశ్వభారతి, శాంతిరామ్‌ బోధనాస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది.

వీటిలో వెంటిలేటర్లతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో కలి్పంచారు. అవసరమైతే జిల్లాలోని మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆ«దీనంలోకి తీసుకుని వైద్యం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. వైద్యులు, నర్సుల కొరత లేకుండా ఉండేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. రిటైర్డ్‌ సిబ్బందితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది సేవల వినియోగానికి ఏర్పాట్లు చేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

01-06-2020
Jun 01, 2020, 05:14 IST
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో...
01-06-2020
Jun 01, 2020, 04:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి 51 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ...
01-06-2020
Jun 01, 2020, 04:27 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీ–7 కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారు. భారత్‌ సహా మరో మూడు దేశాలను చేర్చి...
01-06-2020
Jun 01, 2020, 04:06 IST
న్యూఢిల్లీ: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేశ ప్రజలను ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్ని జాగ్రత్తలతో మరింత అప్రమత్తతతో ఉండాలని...
01-06-2020
Jun 01, 2020, 02:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఆదివారం అటు దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌...
01-06-2020
Jun 01, 2020, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌ : కంటైన్మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రంలో జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కంటైన్మెంట్‌ జోన్లలో...
01-06-2020
Jun 01, 2020, 01:17 IST
వలస కార్మికుల కోసం ఎవరికి వీలైన సహాయం వాళ్లు చేస్తున్నారు. వాళ్లను సొంత ఊళ్లకు పంపుతూ కొందరు, వాళ్లకు కావాల్సిన...
01-06-2020
Jun 01, 2020, 00:53 IST
మహేశ్‌బాబు ఫేవరెట్‌ కలర్‌ ఏంటి? ఆయనకు వంటొచ్చా? ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు? మహేశ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? మహేశ్‌కి...
31-05-2020
May 31, 2020, 21:49 IST
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
31-05-2020
May 31, 2020, 21:30 IST
చనిపోయిన కోవిడ్‌ బాధితుడు బతికే ఉన్నాడని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. మరోసారి అతను చనిపోయినట్టు చెప్పి పరువు తీసుకుంది.
31-05-2020
May 31, 2020, 19:33 IST
ప్రస్తుతం డింకో సింగ్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
31-05-2020
May 31, 2020, 18:07 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొదటితో పోలిస్తే రోజులు గడుస్తున్నా కొద్ది వైరస్‌ వ్యాప్తి...
31-05-2020
May 31, 2020, 16:39 IST
సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదోవిడత లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ...
31-05-2020
May 31, 2020, 16:29 IST
ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా
31-05-2020
May 31, 2020, 15:16 IST
సాక్షి, ముంబై : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిపై శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలో కరోనా విజృంభణకు గుజరాత్‌లో నిర్వహించిన ‘నమస్తే...
31-05-2020
May 31, 2020, 14:20 IST
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌తో పోరాడి...
31-05-2020
May 31, 2020, 13:33 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య...
31-05-2020
May 31, 2020, 13:24 IST
డెహ్రాడున్: క‌రోనా వైర‌స్‌కు త‌న ‌త‌మ తార‌త‌మ్య బేధాలు లేవు. సామాన్యుడి నుంచి పాల‌కుల వ‌ర‌కూ ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రినీ...
31-05-2020
May 31, 2020, 12:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 40,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....
31-05-2020
May 31, 2020, 12:05 IST
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు పాతబస్తీ, మలక్‌పేట్, వనస్థలిపురం, జియాగూడ, కుల్సుంపురలకే పరిమితమైన కరోనా వైరస్‌ తాజాగా కొత్త కాలనీల్లోనూ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top