డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల | Degree supplementary results released | Sakshi
Sakshi News home page

డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

Aug 17 2013 2:25 AM | Updated on Sep 2 2018 4:46 PM

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ తృతీయ సంవత్సరం అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ శుక్రవారం తన కార్యాలయంలో విడుదల చేశారు.

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ తృతీయ సంవత్సరం అడ్వాన్స్ సంప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ శుక్రవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు 2,897 మంది విద్యార్థులు హాజరుకాగా 1179 మంది ఉత్తీర్ణులయ్యారు. 
 
 బీఏలో 393 మందికి 156(39.69 శాతం) మంది, బీఎస్సీలో 2025 మందికి 807(39.85), బీకాంలో 470 మందికి 208(44.26) బీబీఎంలో 9 మందికి 8(88.89)మంది ఉత్తీర్ణత సాధిం చారు. మార్కుల జాబితాలను త్వర లో కళాశాలలకు అందజేస్తామని వీసీ చెప్పారు. రీవేల్యుయేషన్ కోసం 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకో వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజి స్ట్రార్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
 
 షెడ్యూల్ ప్రకారం బీఈడీ పరీక్షలు
 బీఈడీ థియరీ పరీక్షలను ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తామని వీసీ లజపతిరాయ్ చె ప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థుల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దిబ్బదింటాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement