నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ శవానికైన తాళి కడతానని బెదిరించాడు ఓ విద్యార్థి. ఇదే విషయాన్ని బాధితురాలు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లగా ... ఆయన హేళన చేశారు.
నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ శవానికైన తాళి కడతానని బెదిరించాడు ఓ విద్యార్థి. ఇదే విషయాన్ని బాధితురాలు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లగా ... ఆయన హేళన చేశారు. మానసికంగా కుంగిపోయిన బాధితురాలిని గమనించిన తల్లి ఆ విషయాన్ని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి పట్ల సమీప కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ తరచూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని పెళ్లిచేసుకుంటానని వెంటపడి, వేధించసాగాడు.
ఆకతాయి వేధింపులు తట్టుకోలేని బాధితురాలు తాను చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేస్తే ఆయన హేళన చేశాడు. అవమాన భారంతో సదరు విద్యార్థి భోజనం చేయకుండా కుంగిపోతుండటంతో తల్లి గమనించి విషయాన్ని ఆరా తీసింది. తల్లి విషయం తెలుసుకుని విద్యార్థి శ్రీనివాస్పై డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. అందరి సమక్షంలో విచారణ జరిపి శ్రీనివాస్పై చర్యలు తీసుకుంటామని డిగ్రీ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థిని తల్లికి హామీ ఇచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పొరపాటు ఇకపై జరిగితే ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.