కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
నందికొట్కూరు (కర్నూలు) : కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన భాస్కర్(25) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. కడుపునొప్పి తాళలేకనే అతడు ఉరి వేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతుండగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.