 
													సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మామ, ప్రముఖ వ్యాపారవేత్త  మహమ్మద్ హనీఫ్ ఆదివారం మృతిచెందారు. ఆయన పార్దీవ దేహం వద్ద డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. 80 ఏళ్ల వయసులోనూ మునిసిపల్ కౌన్సిలర్‌గా సేవలందించిన హనీఫ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
