గెలిచే ముహూర్తం చెప్పండి సామీ ! | YSR Kadapa Municipal Elections Astrologers Auspicious Time Naminations | Sakshi
Sakshi News home page

గెలిచే ముహూర్తం చెప్పండి సామీ !

Oct 17 2026 1:11 PM | Updated on Oct 17 2026 2:16 PM

YSR Kadapa Municipal Elections Astrologers Auspicious Time Naminations

వైఎస్‌ఆర్‌ జిల్లా: జిల్లాలోని పంచాంగ కర్తలకు,జ్యోతిష్యులకు,వేద పండితులకు  డిమాండ్‌ పెరిగింది. పురపోరుకు షెడ్యూల్‌ విడుదలవడం.. శుక్రవారం వారం నుంచే నామినేషన్‌ మొదలుకావడంతో  ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నామినేషన్‌ వేసేందుకు తిథి..నక్షత్రం, టైం,రోజు తదితర కార్యాక్రమాలకు ముహూర్తం పెట్టించుకుంనేందుకు జాతకాలు చెప్పే పురోహితులు,పంచాంగ కర్తలు,వేదపండితల దగ్గరకు పరుగులు పెడుతున్నారు.

ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. దీంతో మంచిముహూర్తాలు చెప్పండి అంటూ పండితులను ఆశ్రయిస్తున్నారు. విజయానికి మొదటి మెట్టు నామినేషన్‌ మంచి ముహూర్తంలో వేయడమేనన్న నమ్మకం అభ్యర్థుల్లో నాటుకు పోయింది.మరో అడుగు ముందుకేసి ఏ దిక్కు నుంచి ప్రచారం చేస్తే గెలుపు గుర్రాలను ఎక్కవచ్చని జ్యోతిష్యుల ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement