
'ఏపీ కేబినెట్ భజనబృందంలా మారింది'
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు భజనబృందంగా మారిందని, వాస్తవాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు భజనబృందంగా మారారని, వాస్తవాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. గత ఏడాది కాలంగా ఆంధ్రప్రజలు నిరాశలో మునిగిపోయారని అన్నారు.
డ్వాక్రా వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత టీడీపీ సర్కార్దేనని ధర్మాన ఆరోపించారు. రుణమాఫీ చేస్తామన్న అబద్ధ వాగ్ధానంతో లక్షలాది డ్వాక్రా సంఘాలు మూలనపడ్డాయని చెప్పారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులేమైనా తీసుకువచ్చారా అని ధర్మాన ప్రశ్నించారు.