'తూర్పు' ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ తనిఖీలు | crpf held search operations in east godavari district | Sakshi
Sakshi News home page

'తూర్పు' ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ తనిఖీలు

May 28 2015 8:19 AM | Updated on Oct 9 2018 2:51 PM

తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెంలో బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటన జిల్లా సరిహద్దునే చోటుచేసుకోవటంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డతీగల, వై.రామవరం ప్రధాన రహదారిలో చిన్న వంతెనలు, అనుమానాస్పద ప్రదేశాల్లో జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు సరిహద్దు దాటి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement