లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్.. | cpi national leader narayana criticise lokesh,kcr foreign tour | Sakshi
Sakshi News home page

లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్..

May 5 2015 11:12 AM | Updated on Aug 13 2018 4:30 PM

లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్.. - Sakshi

లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తనయుల విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

తిరుపతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తనయుల విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.  లోకేశ్, కేటీఆర్ హైక్లాస్ బెగ్గర్స్గా మారారని ఆయన ఎద్దేవా చేశారు. కాగా లోకేశ్, కేటీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

సీపీఐ నారాయణ మంగళవారం తిరుపతిలో విలేకర్లతో మాట్లాడుతూ రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కుని రాజధాని నిర్మిస్తే అది శ్మశానంపై నిర్మించినట్లే అవుతుందన్నారు. అనంతపురంలో హత్యలకు ప్రభుత్వ కార్యాలయాలు అడ్డగా మారాయని ఆయన మండిపడ్డారు.

వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డిని ప్రభుత్వ కార్యాలయంలోనే హతమార్చడం దారుణమన్నారు. శేషాచలం అడవుల్లో చనిపోయినవారంతా కూలీలే అని, వారు స్మగ్లర్లు అని చంద్రబాబు నిరూపించగలరా అని నారాయణ సూటిగా ప్రశ్నించారు. వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి చనిపోయినవారు స్మగ్లర్లని చంద్రబాబు చెప్పగలరా అంటూ ప్రశ్నలు సంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement