లాక్‌డౌన్: పాప కాని పాప‌కు సీరియ‌స్‌ | Couple Tries To Pass Doll As Sick Child At Check Post In Visakhapatnam | Sakshi
Sakshi News home page

బొమ్మ‌కు సీరియ‌స్‌: పోలీసుల‌నే బురిడీ కొట్టించి..

Apr 30 2020 12:36 PM | Updated on Apr 30 2020 12:53 PM

Couple Tries To Pass Doll As Sick Child At Check Post In Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖ‌ప‌ట్నం: లాక్‌డౌన్ కష్టాలు అన్నిన్ని కావు.. ఓ జంట త‌న బంధువు ఇంటికి వెళ్ల‌డం కోసం బొమ్మ‌ను పాపాయిగా మార్చి పోలీసుల‌నే బురిడీ కొట్టించ‌బోయింది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో చోటు చేసుకుంది. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ బుధ‌వారం ఉద‌యం గోపాల‌ప‌ట్నం నుంచి బైకుపై బ‌య‌లు దేరారు. చెక్ పోస్టుల ద‌గ్గ‌ర పోలీసులు ఆపితే బైక్‌పై కూర్చున్న మ‌హిళ త‌న బిడ్డ‌కు సీరియ‌స్‌గా ఉంద‌ని చెప్ప‌డంతో వారు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా పంపించివేశారు. అలా కొంత‌దూరం ప్ర‌యాణించిన అనంత‌రం న్యాడ్ జంక్ష‌న్ ద‌గ్గ‌ర‌ పోలీసులు ఆపారు. (ఆన్‌లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి క‌ట్టాడు)

ముందుగా అనుకున్న అబ‌ద్ధాన్నే మ‌రోసారి పూస గుచ్చిన‌ట్లు చెప్పారు. కానీ అనుమానం వ‌చ్చిన ఓ కానిస్టేబుల్ పాప‌ను ప‌రీక్షించాలంటూ మ‌హిళ ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూడ‌గా ఆ దృశ్యం చూసి ఖంగు తిన్నాడు. ఎందుకంటే అక్క‌డ ఉన్న‌ది కేవ‌లం బొమ్మ మాత్ర‌మే. దీంతో స‌ద‌రు మ‌హిళ త‌మ బంధువు ఆరోగ్య పరిస్థితి విష‌మంగా ఉంద‌ని అస‌లు విష‌యం చెప్పింది. ద‌య‌చేసి ఈ ఒక్క‌సారికి వదిలేయండి అని పోలీసుల‌ను వేడుకొంది. దీంతో క‌నిక‌రించిన పోలీసులు మ‌రోసారి ఇలాంటి పిచ్చి ప‌నులు చేయ‌కండ‌ని హెచ్చ‌రించి స‌ద‌రు జంట‌ను విడిచిపెట్టారు. (అమ్మ కోసం ఆమాత్రం చేయలేనా: ద‌ర్శ‌కుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement