కరోనా: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల దాతృత్వం

Corona: YSRCP MLAs Distribute Essential Goods To Poor People - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: కష్టకాలంలోనూ పేదలకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు స్ఫూర్తి కలిగించేలా ఉన్నాయని పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆరు లక్షల రూపాయల వ్యయంతో పదివేల కూరగాయల కిట్లు, 30 వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు. వీటిని కంకిపాడు మండలం ఉప్పులూరు నుంచి పంపిణీ చేశారు. ఒక్కో కిట్టులో అయిదు రోజులకు సరిపడా కూరగాయలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెల్ల రేషన్‌, బియ్యం కార్డులేని ప్రతీ పేదవాడికి ఆర్థిక భరోసాకు ఉచిత బియ్యం సీఎం ఆదేశించారని తెలిపారు. (లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం.. )

పశ్చిమగోదావరి జిల్లా: తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలువురి వాలంటీర్‌లకు కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. యలమంచిలి మండలం చించినాడ, నెరేడుమిల్లి గ్రామాల్లో నియోజకవర్గ ఇంచార్జి, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు.. లాక్‌డౌన్‌ కారణంగా వారం రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. (‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’ )

అనంతపురం: పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో పాత్రికేయుడికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, గోధుమ పిండి తదితర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమాచారం ప్రజలకు చేరవేయడంలో మీడియా సోదరుల పాత్ర కీలకమైందన్నారు. విపత్కర సమయంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మరోవైపు గుంటూరులోని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. 250 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రకాశంలోని సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం పల్లెపాలెం‌ గ్రామాలలో కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య సుమారుగా 3లక్షల విలువచేసే నిత్యవసర వస్తువులు అందజేశారు. (నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా: టైగర్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top