నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా: టైగర్‌

Tiger Shroff Shares His Chiseled  Frame Body Throwback Image In Twitter - Sakshi

బాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోల్లో టైగర్‌ ష్రాఫ్‌ ఒకరు. ఫిట్‌గా ఉండటంతో పాటు, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత, సినిమాలకు సంబంధించిన ఫోటోలు, ఫిట్‌గా ఉండే తన బాడీ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా టైగర్‌ ష్రాఫ్‌ ఒక త్రోబాక్‌ (పాత ఫోటో)ను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో టైగర్‌.. తన దృఢమైన కండలను చూపిస్తున్నట్లు ఉంటాడు. ఈ ఫోటోకు ‘మరో రోజు ఆడవిలో’ అనే క్యాప్షన్‌ పెట్టాడు టైగర్‌. తన అభిమాన హీరోలకు సంబంధించిన అన్ని మ్యాట్రిక్స్‌ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నట్లు టైగర్‌ ఓ వీడియోలో పేర్కొన్నాడు.

Just another day in the jungle...

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

అదేవిధంగా తన అభిమాన హాలీవుడ్ నటుడు కీను రీవ్స్ సినిమాలను మూడింటిని ఒక దాని తర్వాత ఒకటి చూసినట్లు టైగర్‌ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలను చూసిన అనంతరం తన అభిమానుల కోసం శ్వాస తీసుకునే వ్యాయామ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రజలు కరోనా వైరస్‌ను ఎదుర్కొవాలనే ఆకాంక్షతో ఇటీవల బాలీవుడ్‌ సెలబ్రిటీలు రూపొందించిన ‘ముస్కురాయోగా ఇండియా’ అనే సందేశాత్మకమైన పాటను టైగర్‌ తన ట్విటర్‌ పోస్ట్‌ చేశాడు. ఇక ఈ పాటలో టైగర్‌తో పాటు  విక్కీ కౌషల్, రాజ్‌కుమార్‌రావు, కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్‌ కురానా, భూమి పెడ్నేకర్, సిద్దార్థ్‌ మల్హోత్రా, అక్షయ్ కుమార్ నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top