లాక్‌డౌన్‌: ఒడిశా కీలక నిర్ణయం

Corona: Odisha Government Extend Lockdown Till April 30 - Sakshi

లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నవీన్‌ పట్నాయక్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

భువనేశ్వర్‌ : ఒడిశాలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం ఏప్రిల్‌14 వరకు 21 రోజుల లాక్‌డౌన్‌ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను  ఏప్రిల్‌ 30 వరకు కొనసాగించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం నవీన్‌ పట్నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను పొడగించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ‘కోవిడ్‌-19 సంక్షోభం కారణంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ కాలంలో మీ క్రమశిక్షణ, త్యాగం కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి మాకు బలాన్ని ఇచ్చింది’ అని సీఎం నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో రైళ్లు, విమానాల సేవలు ఈ నెల ఆఖరు వరకు నిలిపి వేస్తున్నట్లు, జూన్‌ 17 వరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు సీఎం తెలిపారు. అయితే వ్యవసాయ ఆధారిత పనులకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. కరోనా తర్వాత పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవని, ప్రజలంతా అర్థం చేసుకోని.. సహకరించాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ కోరారు.(కరోనా: 5 వేలు దాటిన కేసులు.. అక్కడ తొలి మరణం )

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించడం తప్ప మరో దారి లేదంటూ పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసినా తెలంగాణలో మాత్రం కొనసాగించాలనుకుంటున్నట్టు
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌ సర్కార్‌ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్‌ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.
కరోనా: ‘ఆ డ్రగ్‌ తనకు పనిచేయలేదు’ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top