వంట గ్యాస్ ఆదా చేయండిలా.. | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్ ఆదా చేయండిలా..

Published Mon, Sep 23 2013 12:12 AM

cooking gas savings tips

 పటాన్‌చెరు రూరల్, న్యూస్‌లైన్: వంటింట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే 30 శాతం గ్యాస్ ఆదా అవుతుందని అంటున్నారు. అవి ఏమిటంటే...
  వంట చేసేటప్పుడు వండుతున్న పాత్రలపై మూత పెట్టి ఉంచడం.
  ప్రెషర్ కుక్కర్లను వినియోగించడం.
  గ్యాస్ పొయ్యి వెలిగించే ముందే వంటకు కావాల్సిన అన్నిరకాల సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలి.
  ఫ్రిడ్జ్‌ల నుంచి తీసిన పదార్థాలను వెంటనే స్టౌపై ఉడికించరాదు.
  పప్పు దినుసులు, బియ్యం వంటివి ముందే నీళ్లలో నాన పెట్టి ఉడకపెట్టడం మంచిది.  
  వండే పరిమితిని బట్టి పాత్రను వాడాలి. వంట పాత్ర అడుగు భాగం వెడల్పుగా ఉండాలి.
  వంట పాత్రలు మరగడం మొదలైన వెంటనే మంట తగ్గించాలి (సిమ్ చేయాలి).
  తరచూ స్టౌ బర్నల్‌ను శుభ్రం చేయించుకోవాలి.
  బీటలు వారిన పైపు (రబ్బర్ ట్యాబ్)ను వాడకూడదు.
  గాలి ఎక్కువగా వీచే ప్రాంతంలో వంట చేయరాదు. (కిచెన్‌లో ఎక్కువ గాలి రాకుండా చూసుకోవాలి.)
  వంట పూర్తయ్యేంత వరకు వంట గదిని విడిచి వెళ్లరాదు.
  మరిగే పాత్రల నుంచి పదార్థాలు బర్నర్‌లపై పడకుండా చూడాలి. 

Advertisement
Advertisement