'విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతోంది' | Congress High command quick to form Telangana state, says jaya prakash narayana | Sakshi
Sakshi News home page

'విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతోంది'

Published Thu, Jan 30 2014 2:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతోంది' - Sakshi

'విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతోంది'

రాష్ట్ర విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై  కేంద్రం శరవేగంగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అయిదు కోట్ల మంది ప్రజలను అడ్డగోలుగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఈ చర్య సమైక్య స్పూర్తికి వ్యతిరేకమన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేలా కేంద్రం కసరత్తు చేయాలని జేపీ అన్నారు. సీమాంధ్రవారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా బీజేపీ కూడా కృషిచేయాలని ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement