కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ విలీనం అయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.
	న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ విలీనం అయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఓట్లు చీలకూడదనేదే తమ ఉద్దేశం అని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. టిఆర్ఎస్తో  పొత్తు లేదా సీట్ల అవగాహన ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు పూర్తయిన తరువాత టిఆర్ఎస్ బీజేపీ వైపు వెళుతుందేమోనన్న  అనుమానాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేశాయి.
	
	ఇదిలా ఉండగా, కాంగ్రెస్లో టిఆర్ఎస్ విలీనం అవుతుందా? పొత్తా అనే విషయం ఇంకా ఖరారు కాలేదని ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ  చెప్పారు. టిఆర్ఎస్  విలీనం అవుతుందని దిగ్విజయ్ సింగ్ ఎన్నడూ అనలేదన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
