వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతపురం: కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు వై.విశ్వేశ్వర రెడ్డి, అనంతవెంకట రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, శంకర్ నారాయణ తదితరులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేతలు విజ్ఞప్తి చేశారు.